మర్యాదపూర్వకంగా భేటీ ….
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజక వర్గంలో ఎన్నికల ప్రచార పర్యటనలో భాగంగా మాజీ ఎమ్మెల్యే, నియోజక వర్గ టిడిపి ఇంచార్జీ శ్రీ వర్మ గారి ఇంటికి వెళ్ళి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
గొల్లప్రోలు నుంచి పి. దొంతమూరు వరకూ అశేష జనం ఘన స్వాగతం పలికారు.
జనసేన, టిడిపి శ్రేణులతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. శ్రీ వర్మ గారి కుటుంబ సభ్యులు సత్కరించారు. ఆయన మాతృమూర్తి శ్రీమతి అలివేలు మంగ పద్మావతి గారి ఆశీర్వాదం తీసుకున్నారు.
ఈ సందర్భంగా శ్రీ వర్మ గారిని, శ్రీ సుజయ్ కృష్ణ రంగారావు గారినీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు సత్కరించారు.