మాజీ సిఎం పై ఫొక్సో కేసు….
**
6th sense TV: బెంగళూరు:
పోక్సో కేసుపై స్పందించిన యడియూరప్ప…
లైంగిక వేధింపుల ఆరోపణలతో తనపై నమోదైన పోక్సో కేసుపై కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప స్పందించారు. ‘రెండు నెలల క్రితం తల్లి, కూతురు ఓ కేసు విషయంలో మా ఇంటికి వచ్చారు. కష్టాల్లో ఉన్నందున వారికి డబ్బు ఇచ్చాను. ఆ తర్వాత పోలీస్ కమిషనర్కి ఫోన్ చేసి ఈ విషయంపై మాట్లాడాను. వాళ్లు నాపై ఫిర్యాదు చేసినట్లు ఇప్పుడే తెలిసింది. ఇలాంటివి నేను ఊహించలేదు. వీటిని ఎదుర్కొంటాం’ అని యడియూరప్ప అన్నారు.
