మార్చి 5న జరగబోయే భారీ బహిరంగ సభను విజయవంతం చేయండి-చలమల శెట్టి సునీల్
6th sense TV:ప్రతిపాడు నియోజకవర్గ స్థాయి వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుల కార్యకర్తల సమావేశంలో వైసిపి కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ చలమలశెట్టి సునీల్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు
కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో నియోజకవర్గ ఇంచార్జ్ వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో మార్చి 5న జరగబోయే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని వైసీపీ కాకినాడ పార్లమెంట్ ఇంచార్జ్ శ్రీ చలమలశెట్టి సునీల్ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇంచార్జ్ పరుపుల సుబ్బారావు కోరారు ప్రత్తిపాడులో వరుపుల సుబ్బారావు గారి ఆధ్వర్యంలో జరిగిన నియోజకవర్గ స్థాయి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల సమావేశంలో చలమలశెట్టి సునీల్ గారు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో ఉన్న 400 వందల గ్రామాలను నా సొంత పూచికతతో దత్తత తీసుకొని గ్రామానికి కోటి రూపాయలు వెచ్చించి నాలుగు వందల కోట్ల రూపాయలతో గ్రామాల అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తానని సునీల్ గారు అన్నారు భారీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటుతో పాటు కోస్టల్ ప్రాంతాన్ని పారిశ్రామిక పరంగా అభివృద్ధి చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రణాళిక చేపడతానని అన్నారు రుపుల సుబ్బారావు మాట్లాడుతూ మార్చి 5న జరగబోయే భారీ బహిరంగ సభను విజయవంతం చేసే విధంగా నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సునీల్ గారి ని నన్ను కోరారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వైయస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు