*మెట్లపై పడిపోయిన విజయ్ దేవరకొండ..*
6th sense TV: తెలంగాణ: హైదరాబాద్:
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం
తన కొత్త ప్రాజెక్ట్స్ చిత్రీకరణలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే.. తాజాగా విజయ్ దేవరకొండకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. అందులో విజయ్ మెట్లపై నడుస్తూ అనుకోకుండా కింద పడ్డాడు. తాజాగా ముంబైలో ఓ ఈవెంట్లో పాల్గొన్నాడు విజయ్. అనంతరం ఆ ఈవెంట్ నుంచి బయటకు వస్తూ అనుకోకుండా స్టెప్స్ పై పడిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా.. ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ ఘటనలో విజయ్ కు ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. కిందపడిన వెంటనే పక్కన ఉన్న సిబ్బంది అలర్ట్ అయ్యి ఆయనను పైకి లేపగా.. ఆ తర్వాత విజయ్ సాధారణంగా నడుచుకుంటూ వెళ్లిపోయారు.