రాజమండ్రితో నాకు 25 ఏళ్ల అనుబంధం ఉంది…
6th sense TV:రాజమండ్రి వైసిపి సిద్ధం సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నాని
-వైయస్సార్ చిత్రపటానికి నివాళులు అర్పించి సభను ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి నాని…
-ఎమ్మెల్యే నానితో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపిన మహిళ నేతలు….యువత
సభా వేదికపై ఎమ్మెల్యే నాని మాట్లాడుతున్నంత సేపు….. పార్టీ శ్రేణుల నినాదాలతో హోరెత్తిన సభా ప్రాంగణం
ఎమ్మెల్యే కొడాలి నాని పాయింట్స్
రాజమండ్రితో నాకు 25 ఏళ్ల అనుబంధం ఉంది.
తరచూ విశాఖపట్నం వెళ్లే నేను మార్గమధ్యలో రాజమండ్రిలో తప్పకుండా ఆగుతాను.
గత ఐదేళ్లలో ఎన్నడూ జరగనంత అభివృద్ధి రాజమండ్రిలో జరిగింది.
వైసిపి హయంలో జరిగిన అభివృద్ధి రాజమండ్రి వ్యాప్తంగా కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది.
చిత్తశుద్ధితో పనిచేస్తే, మన ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవచ్చో ఎంపీ మార్గాన్ని భరత్ చూపించారు.
రాజమండ్రి ప్రాంతాన్ని వైఎస్ఆర్సిపి కంచుకోటగా తీర్చిదిద్దే బాధ్యతను…… సీఎం జగన్ భరత్ కు అప్పగించారు.
ఎన్నికల్లో చంద్రబాబు ఒక్కడిగా వస్తే ఫుట్బాల్ తన్నినట్లు , సీఎం జగన్ తంతారనే భయంతో మంది మార్బలంతో వస్తున్నాడు.
దత్త పుత్రుడు….. ఉత్త పుత్రుడు చెరోపక్కన వేసుకున్న చంద్రబాబు….. వెనకాల వదినమ్మ…. ముందు చెల్లెమ్మ….. వీళ్లు చాలక ఎల్లో మీడియా….. వాళ్లు చాలక ఇప్పుడు తీసేసిన తాసిల్దార్ పీకేను కూడా తెచ్చుకున్నాడు.
ఏదో చేసేద్దామని పిచ్చి వెధవలందరిని తెచ్చుకుని రాష్ట్రంపై వదులుతున్నాడు.
రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రాణం పోయిన సీఎం జగన్ వెంట తామంతా నిలబడతాం.
వైయస్సార్ రెండు అడుగులు వేస్తే…. జగన్ పది అడుగులు వేసి విద్య ,వైద్యాన్ని పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.
ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందించి లక్షల మందిని కాపాడిన సీఎం జగన్ కు….. అండగా ఉండి మనమందరం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది.
గత 70 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పేద ప్రజల ఆర్థిక ప్రగతికి రెండు లక్షల 57 వేల ప్రభుత్వ సొమ్మును పేదల ఖాతాల్లో ట్రాన్స్ఫర్ చేసిన ఘనత సీఎం జగన్ దె.
మే నెలాఖరున సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపగలిగే శక్తి రాష్ట్రంలో ఏ ఒక్కరికి లేదు.
చంద్రబాబుకు పవన్ సామాజిక వర్గం ఓట్లు కావాలి…. కానీ సీట్లు ఇవ్వరు.
విచక్షణ ఉన్న జనసైనికులు, చంద్రబాబు చేసిన మోసాన్ని పసిగట్టారు.
మేము రాష్ట్రంలో ఏ నియోజకవర్గాన్ని టార్గెట్ గా పెట్టుకోలేదు 175 స్థానాల్లో గెలవడమే మా లక్ష్యం.
తమకు పక్కలో బల్లెంలా అవుతాడన్న భయంతో పవన్ కళ్యాణ్ ను ఓడించేది టిడిపినే…..
వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్లైన్ చంద్రబాబు, నాదెండ్లను పవన్ కళ్యాణ్ పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడు.
అధికారంలో ఉన్న ఎన్టీఆర్ నే కూల్చి పడేసిన చంద్రబాబు,నాదెండ్ల వారికి పవన్ ఎంత.
గుంట నక్కలతో కలిసి పయనిస్తున్న పవన్ కళ్యాణ్ ను జన సైనికులు, అభిమానులు కాపాడుకోవాలి.
చంద్రబాబు చేస్తున్న మోసానికి జన సైనికులు, అభిమానులు టిడిపిను, చంద్రబాబును పాతాళానికి తొక్కాలి.
రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మార్గాన్ని భరత్, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గూడూరు శ్రీనివాసరావును ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించాలి.
వైసీపీ అభ్యర్థులను గెలిపిస్తే గోదావరి తీరం మరింత అభివృద్ధి చెందుతుంది.
భరత్, శ్రీనివాసరావు విజయోత్సవ వేడుకల్లో నేను పేర్ని నాని పాల్గొంటాం.