రామోజీరావుకు జర్నలిస్టుల సంతాపం…..
6th sense TV: కాకినాడ జిల్లా:కాకినాడ:ఈనాడు సంపాదకులు, మయూరి సంస్థల అధినేత,అనేక భాషలలో బ్రాడ్ కాస్ట్ మీడియాలు ఈనాడు ఈటీవీల ఏర్పాటు, అనేక వాణిజ్య సంస్థలను సృష్టించి, కొత్త పుంతలు తొక్కించిన చెరుకూరి రామోజీరావు మృతి పట్ల కాకినాడ జర్నలిస్టులు ఘనంగా సంతాపం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం స్ధానిక ఆర్@బి అతిధి గృహంలో సీనియర్ పాత్రికేయులు స్వాతి ప్రసాద్ అధ్యక్షతన సంతాప సభ ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా పలువురు పాత్రికేయులు మాట్లాడుతూ, పాత్రికేయ రంగంలో అంచెలంచెలుగా ఎదుగుతూ మీడియాలో కొత్త ఒరవడి సృష్టించి,సినీ సాహితీ,వ్యాపార రంగానికి ఎనలేని సేవలు చేసిన రామోజీరావు మరణం విచారకరమన్నారు. ఈనాడు అనే తెలుగు దినపత్రిక ద్వారా తెలుగు భాషకు అమోఘమైన సేవ చేశారని, వాడుక భాషను వినియోగంలోకి తీసుకురావడంలో కీలక భూమి పోషించిన ఘనత రామోజీరావుదే అని తెలిపారు. ఈ సంతాప సభ కార్యక్రమంలో పాత్రికేయులు ఈనాడు చిరంజీవి, చంద్రశేఖర్, మంగా వెంకట శివరామకృష్ణ, శివన్నారాయణ రెడ్డి, దురానీ ,అంజిబాబు, యన్ టివి సుధీర్, సలీమ్ ,వర్మ ,రాయవరపు ప్రభాకర్, పిచ్చుక రఘు, గుండు శ్రీను, త్రినాథ్, బాల,రామ్ జీ తదితర పాత్రికేయులు పాల్గొన్నారు.