రెవెన్యూ అధికారులు వచ్చినా ఎవరెవరుతోనో ఫోన్లో మాట్లాడి???
_ 6th sense TV: కాకినాడ:తమ స్థలాన్ని సర్వే చేసి మాకు అప్పగించండి _ యజమాని వేడుకోలు
కాకినాడ శివారు మహాలక్ష్మి నగర్ ప్రాంతంలో ఉన్న ఆకుల గోపయ్య ఎడ్యుకేషన్ ట్రస్టుకు సంబంధించి ఉన్న ఎనిమిది ఎకరాల 85 సెంట్లు భూమిని సర్వే చేసి తమకు అందించాలని స్థల హక్కుదారుడు ఆకుల నరేష్ వేడుకొన్నారు. సుమారు సుమారు 15 ఏళ్ల నుండి ఈ స్థలం కాకినాడకు చెందిన మాజీ ప్రజా ప్రతినిధి వారి బంధువులు బంధువులు తమదే అంటూ ఇబ్బందులు పెడుతున్నారని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి ఫలితం లేదన్నారు. తక్షణమే మా ఈ స్థలాన్ని సర్వే చేసి అధికారులు అప్పగించాలని విలేకరుల ఎదుట వాపోయారు. గురువారం మహాలక్ష్మి నగర్ ట్రస్ట్ ప్రాంగణం వద్ద సర్వే చేస్తామంటూ నగర, గ్రామీణ ప్రాంతాలకు చెందిన రెవెన్యూ అధికారులు వచ్చినా వారు సర్వే చేయకుండా ఎవరెవరుతోనో ఫోన్లో మాట్లాడి మెల్లగా జారుకున్నారని నరేష్ చెప్పారు.
తక్షణమే అధికారులు సర్వే చేసి స్థలాన్ని అప్పగించాలని నరేష్ కోరారు. తమకు చెందిన సర్వే స్థల నెంబర్లలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నా అవతలి వ్యక్తులు కావాలని వివాదం సృష్టిస్తున్నట్లు నరేష్ చెప్పారు. స్థలము వద్ద ఎటువంటి వివాదం రాకుండా పోలీసు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు….