*రోడ్డు ఆక్సిడెంట్లు లను తగ్గించాలనే ఉద్దేశంతో….
6th sense TV: కాకినాడ జిల్లా: కాకినాడ సిటీ:
ఈరోజు (25.11.2024) వ తేదీన సాయంత్రం, గౌరవనీయులైన కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్., గారి ఉత్తర్వులు మేరకు మరియు కాకినాడ SDPO శ్రీ రఘువీర్ విష్ణు గారి సారథ్యంలో, కాకినాడ ట్రాఫిక్ 1 PS CI యన్. రమేష్, ట్రాఫిక్ SIs 1&2 ch.కిషోర్ కుమార్ & వెంకట రత్నం మరియు సిబ్బందితో *రోడ్డు ఆక్సిడెంట్లు లను తగ్గించాలనే ఉద్దేశంతో మెయిన్ రోడ్డు లోని *”జిలాని సెంటర్”* నందు హెల్మెట్ ధరించని ద్విచక్రవాహనదారులకు ట్రాఫిక్ రూల్స్ పైన అవగాహన కార్యక్రమము నిర్వహించినారు.
✍️ 1) మోటార్ సైకిల్స్ నడిపే ప్రతి ఒక్కరు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని,
2) ట్రిపుల్ రైడింగ్, బైక్ స్టంట్స్, మైనర్ డ్రైవింగ్ చేయరాదని.
3) వాహనములను అతి వేగముగా నడపడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వలన కలుగు ప్రమాదాలు గురించి వారికి వివరించడం జరిగినది.
4) ద్విచక్ర వాహనం నడుపు ప్రతి ఒక్క సభ్యులు అందరు విధిగా హెల్మెట్ ధరించి వాహనము నడపాలని, ప్లకార్డ్స పట్టుకుని వాహనదారులకు అవగాహన కల్పించారు.
✍️ హెల్మెట్ ధరించిన వాహన దారులతో, హెల్మెట్ ధరించని వాహనదారులకు, హెల్మెట్ ధరించుట వలన ఉపయోగాలు తెలియజేయడంతో, హెల్మెట్ ధరించని వాహనదారులు హర్షద్వానాలతో అభినందనలు తెలియజేసినారు.
5) తదుపరి *112, 1930 కాల్స్* యొక్క ఉపయోగములు గురించి అవగాహన కల్పించారు.
ఇట్లు
CIs ట్రాఫిక్ 1&2 పీస్ కాకినాడ.