లోక్ సభ స్పీకర్ ఎన్నికపై వైయస్ జగన్ షాకింగ్ డెసిషన్….?
6th sense TV: ఆంధ్రప్రదేశ్:ఏపీ పాలిటిక్స్ లో సంచలన పరిణామం…
ఎన్నికల్లో తమ ప్రత్యర్థులు టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేసి తమను ఓడించిన బీజేపీకి స్పీకర్ ఎన్నికలో జగన్ మద్దతు తెలపడం హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాకుండా జగన్ బద్దశత్రువులైనా టీడీపీ, జనసేనలు సైతం ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. స్పీకర్ ఎన్నికలో జగన్ ఎన్డీఏకు మద్దతు పలకడంతో ఆంధ్రప్రదేశ్‌లోని 25 మంది ఎంపీల ఓట్లు ఓం బిర్లాకే పడనున్నాయి. ఎన్నికల్లో తమను ఘోరంగా ఓడించిన ఎన్డీఏ కూటమికి జగన్ మద్దతు ఇవ్వడం వెనక ఉన్న వ్యూహాం ఏమిటి అనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. అయితే, రాష్ట్రంలో పవర్ లేకపోవడం.. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ అధికారంలో ఉండటంతో కేసుల నుండి తప్పించుకునేందుకు జగన్ ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చినట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా జగన్ ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేయడం పొలిటికల్ కారిడార్స్‌లో చర్చనీయాంశంగా మారింది.