వైసీపీ ప్రభుత్వ అరాచక పాలననుఅంతముందించేందుకు కాకినాడ నగర ప్రజలు సిద్ధం…
విస్తృతస్థాయి సమావేశంలో వనమాడి
వైసీపీ ప్రభుత్వ అవినీతి, అరాచకం, దోపిడీ, డ్రగ్స్, రౌడీ, గూండా, కబ్జా పాలనను అంతమొందించేందుకు కాకినాడ నగర ప్రజలు సిద్ధంగా ఉన్నారని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న శంఖారావం సూపర్ సిక్స్, భవిష్యత్తు గ్యారెంటీ, తదితర అంశాలపై కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయము నందు శనివారం కాకినాడ సిటీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనకు స్వస్తి పలికేందుకు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు, కార్మికులు సిద్ధంగా ఉన్నారని, వైసిపి ప్రభుత్వ అరాచక విధ్వంసక పాలన వల్ల రాష్ట్రం ఎంతో నష్టపోయిందని, వైసిపి అరాచక పాలన నుండి రాష్ట్రాన్ని కాకినాడ నగరాన్ని కాపాడవలసిన బాధ్యత నేడు ప్రతి ఒక్కరిపై ఉందని, జగన్ రెడ్డి అసమర్థత పాలన వల్ల రాష్ట్ర అప్పులు విపరీతంగా పెరగడంతో ఆ భారం ప్రజలపై పడి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని, నిత్యవసర వస్తువుల ధరలు, ఇంటి పన్నులు, విద్యుత్ చార్జీలు, బస్ చార్జీలు, 5 రెట్లు పెంచి, చెత్త పన్నులు లాంటి కొత్త పన్నులు వేసి ప్రజల రక్తాన్ని వైసీపీ నాయకులు జలగల్లా పీల్చిస్తున్నారని, ప్రశాంత వాతావరణము గల కాకినాడ నగరాన్ని నేడు గుండాల, రౌడీల, డ్రగ్స్, నగరంగా మార్చి కాకినాడ నగర ప్రతిష్ట ద్వారంపూడి దిగజార్చడని, ద్వారంపూడి అక్రమ సంపాదన కోసం కాకినాడ నగరాన్ని డ్రగ్స్ గంజాయి నగరంగా నగరంగా మార్చి యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాడని, భూములు కనిపిస్తే చాలు వైసిపి నాయకులు చేతిలో కబ్జాలకు గురవుతున్నాయని, ప్రభుత్వ భూములుపై కూడా టి.డి.ఆర్. బాండ్ల రూపంలో 500 కోట్ల రూపాయలు దోచుకున్నాడని, అధికారం కోసం స్వార్థ రాజకీయాల కోసం కులాలు, మతాలు, వర్గాలు, జాతుల మధ్య చిచ్చులు పెట్టి ఘర్షణ వాతావరణాన్ని సృష్టించి లబ్ధి పొందడానికి కుట్ర రాజకీయాలు చేస్తున్నాడని, మోసపూరిత మాయ మాటలతో ప్రజల్ని మరొక్కసారి మోసగించడానికి ద్వారంపూడి ప్రయత్నిస్తున్నాడని, కాకినాడ నగరంలో ద్వారంపూడి అవలంబిస్తున్న విధ్వంసకర పాలనను తరిమికొట్టి తెలుగుదేశం జనసేన ప్రభుత్వ ఏర్పాటుకు ప్రతి కార్యకర్త సైనికులా కృషి చేయాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, తుమ్మల రమేష్, నృసింహదేవర విశ్వనాధం, SK రహీమ్, గదుల సాయిబాబా, బచ్చు శేఖర్, MD ఆన్సర్, MA తాజద్దీన్, దండిప్రోలు నాగబాబు, సీకోటి అప్పలకొండ, చింతా పేర్రాజు, KVS మూర్తి, ఒమ్మి బాలాజీ, మల్లిపూడి నాగ సూర్య దీపిక, తుమ్మల సునీత, రిక్కా లక్ష్మి, దేవు జయలక్ష్మి, జిలాని, గుత్తుల రమణ, పిర్ల ప్రసన్న, బంగారు సత్యనారాయణ, అంబటి చిన్నా, క్లస్టర్, యూనిట్, బూత్ కన్వీనర్లు, తదితరులు పాల్గొన్నారు.