సారా బట్టిపై పోలీసులు దాడి..
6th sense TV:జె.కొత్తూరు:
కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జె.కొత్తూరు గ్రామ శివారున నిర్వహిస్తున్న సారా బట్టిపై పోలీసులు దాడులు నిర్వహించారు…
అక్రమంగా సారా బట్టి నిర్వహిస్తున్నట్లు జగ్గంపేట ఎస్సై టి. రఘునాధరావుకు వచ్చిన సమాచారం మేరకు మంగళవారం తెల్లవారుజామున ఎస్సై తన సిబ్బందితో దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో 600 లీటర్ల బెల్లపు ఉటను ధ్వంసం చేయడం జరిగిందని ఎస్ఐ తెలిపారు. అదేవిధంగా అక్రమంగా సారా తయారీకి పాల్పడుతున్న కేసు బోయిన వీర్రాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి 20 లీటర్ల సారా స్వాధీనం చేసుకొని,కేసు నమోదు చేశామన్నారు. అతని కోర్టుకు హాజరు పరుస్తామన్నారు.