సుప్రీంలో కేసు వేయడం ఇక సులభం,,,,
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18 ( సుప్రీంకోర్టులో కేసు వేయాలంటే. అది చాలా ఖర్చుతో కూడుకున్న పనని భావిస్తాం.. దీంతో చాలా మంది పేదలు.. మధ్యతరగతి ప్రజలు తమకు అన్యాయం జరిగినా- సుప్రీంకోర్టుకు వెళ్లడానికి సాహసించరు. ఖర్చులు తడిసిమోపెడవుతాయని భయపడుతుంటారు. ఇకపై ఆ భయం లేదు. పేదలు, మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని సుప్రీం కోర్టు ఒక ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ పథకం పేరు మధ్య ఆదాయ వర్గ (ఎంఐజీ) పథకం, నెలకు రూ.80 వేలలోపు, ఏడాదికి రూ.1.50 లక్షల లోపు ఆదాయం కలిగిన వారు ఈ పథకం పరిధిలోకి వస్తారు. వీరి కోసం సుప్రీంకోర్టు మధ్య ఆదాయ వర్గ న్యాయ సహాయ సొసైటీని ఏర్పాటు చేసింది. దీనికి భారత ప్రధాన. న్యాయమూర్తి ప్యాట్రన్ ఇన్ బీమ్ గా, అటార్నీ జనరల్ ఎక్స్ ఆఫీ షియో వైస్ ప్రెసిడెంట్ గా, సొలిసిటర్ జనరల్ గౌరవ కార్యదర్శిగా, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు సభ్యులుగానూ ఉంటారు.
ఫీజులెంత..!
- న్యాయం పొందాలనుకునే మధ్యతరగతి ప్రజలు రూ.500
సొసైటీకి, రూ.750 సర్వీస్ చార్జి కింద చెల్లించాలి. అనంతరం పిటిష నేను సొసైటీలో దాఖలు చేయాలి. వీటిని అడ్వకేట్ ఆన్ దికార్డు (ఏఓఆర్)కు పంపిస్తారు. ఈ కేసు విచారణకు అర్హమైనదని ఏఓఆర్ భావిస్తే, దీనిపై కోర్టులో వాదనలు వినిపించేందుకు ఒక న్యాయవా దికి బాధ్యతలను సొసైటీ అప్పగిస్తుంది. పిటిషన్ న్యాయ వివాదా నికి అర్హమైనది కాదని ఏఓఆర్ నిర్ణయిస్తే సర్వీస్ ఛార్జి కింద వసూలు చేసిన రూ.750 మినహాయించుకుని మిగతా సొమ్మును వెనక్కు ఇచ్చేస్తారు. సొసైటీ ద్వారా సుప్రీంకోర్టులో దాఖలయ్యే కేసులు సాధారణ కేసుల్లాగే విచారణకు వస్తాయి.
తీర్పు ఎలా వస్తుంది…!
- తీర్పు ఎలా వచ్చినా దాంతో సొసైటీకి సంబంధం ఉండదు. కేసు దాఖలు చేయటం, న్యాయవాదిని ఎంపిక చేసుకోవటంలో మాత్రమే సొసైటీ సహకరిస్తుంది. సుప్రీంకోర్టును ఆశ్రయించటం
పేదలు, మధ్య తరగతి వర్గాల కోసం ప్రత్యేక పథకం
అనేది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అయిన నేపథ్యంలో సాధారణ ఫీజుతోనే తమ వివాదా లను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చి న్యాయం పొందే అవకాశాన్ని ప్రజలకు ఇవ్వాలన్నదే సొసైటీ ఉద్దేశం.
- కేసును చేపట్టిన న్యాయవాది నిర్లక్ష్యం వహిస్తున్నాడని నిరూపణ అయితే సుప్రీం కోర్టు సదరు న్యాయవాదిని పథకం ప్యానెల్ నుంచి తొలగిస్తుంది. ఈ పథ కానికి సంబంధించిన పూర్తి వివరాలు.. Sero సమగ్ర స్వరూపం http://supremecourtofind- la.nic.in/mig.htm u 20.🇮🇳🙏🇮🇳