*సైబర్ నేరాలు మరియు 1930 కాల్స్”* యొక్క ఉపయోగాలు గురించి….?
🙏 నమస్కారం సార్🙏🏻
ఈరోజు (28.11.2024) వ తేదీన, రోడ్డు ఆక్సిడెంట్ లు తగ్గించాలనే ఉద్దేశంతో గౌరవనీయులైన కాకినాడ జిల్లా ఎస్పీ *శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్.,* గారి ఉత్తర్వులు మేరకు మరియు కాకినాడ *SDPO శ్రీ రఘువీర్ విష్ణు* గారి పర్యవేక్షణ లో, కాకినాడ ట్రాఫిక్ 1&2 ఇన్స్పెక్టర్లు యన్ రమేష్, డి రామారావు మరియు TSI వెంకటరత్నం తో కాకినాడ రామకోస సెంటర్ వద్ద ఉన్న *” శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ”* విద్యార్థులకు, *ట్రాఫిక్ రూల్స్ & రెగ్యులేషన్ పైన, హెల్మెట్ వాడకం పైన మరియు సైబర్ నేరాల* గురించి అవగాహన కల్పించినారు.
✍️ ప్రస్తుతం జరుగుతున్నా *సైబర్ నేరాలు మరియు 1930 కాల్స్”* యొక్క ఉపయోగాలు గురించి ( ఆన్ లైన్ మోసాలు, పేక్ లోన్ మోసాలు, ఆన్లైన్ లో జాబ్స్ /వర్క్స్, డిజిటల్ అరెస్ట్) మరియు *”112 కాల్”* యొక్క ఉపయోగాలు గురించి అవగాహనను *వీడియో రూపములో* విద్యార్థిని, విద్యార్థులులకు అవగాహన కల్పించారు.
✍️ తదుపరి *ట్రాఫిక్ రూల్స్ పై అవగాహనలో భాగంగా…*
1) మోటార్ సైకిల్స్ నడిపే ప్రతి ఒక్కరు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని, ఈ విషయమై తమ కుటుంబసభ్యులకు మరియు తల్లి తండ్రులకు తెలియజేయాలనీ,
2) ట్రిపుల్ రైడింగ్, బైక్ స్టంట్స్, మైనర్ డ్రైవింగ్ వలన జరుగు ప్రమాదములు గురించి,
3) జీబ్రా లైన్స్ లేని ప్రదేశములలో రోడ్డు ను ఏవిధంగా దాటాలి, ట్రాఫిక్ Signs వలన ఉపయోగములు 🚫🚷🚯🚳🚱⚠️🚸🔻🔲
4) వాహనములను అతి వేగముగా నడపడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వలన కలుగు ప్రమాదాలు గురించి, అవగాహనను *వీడియో రూపములో* విద్యార్థిని, విద్యార్థులులకు అవగాహన కల్పించారు.
ఇట్లు
CIs ట్రాఫిక్ 1&2 PS కాకినాడ