హైపర్ ఆదికి జనసేన ఎమ్మెల్సీ పదవి.. క్లారిటీ…?
6th sense TV:ఆంధ్రప్రదేశ్:
జనసేన నుంచి ఎమ్మెల్సీ పదవి ఇస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది స్పందించారు. ‘శివం భజే’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో హైపర్ ఆది మాట్లాడారు. జనసేన ఎమ్మెల్సీ పదవి ఇస్తారనే వార్తల్లో వాస్తవం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయన కోసమే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు ఆది చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ సంతోషంగా ఉంటే దూరంగా ఉండి చూస్తానని, బాధలో ఉంటే దగ్గరకెళ్లి చూసుకుంటానన్నారు.