◼️ || నేటి నుంచి ఏపీ ఇంటర్ పరీక్షలు || ◼️
6th sense TV ఆంధ్రప్రదేశ్:
ఏపీలో మార్చి 1 నుంచి ప్రారంభంకానున్న ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఇంటర్మీడియట్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు.
విద్యార్థులకు ముఖ్య సూచనలు..
➥ ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్ష హాల్‌టికెట్లను తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.
➥ హాల్‌టికెట్‌తోపాటు తమ కాలేజీ ఐడీ కార్డును కూడా పరీక్షలకు తీసుకుని వెళ్లాలి.
➥ పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. కాబట్టి విద్యార్థులు పరీక్ష సమయానికి అరగంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి.
➥ అలాగే విద్యార్ధులు పరీక్షల్లో సమాధానాలు రాసేందుకు బ్లూ లేదా బ్లాక్ ఇంక్ పెన్నులు మాత్రమే వాడాలి.
➥ విద్యార్ధులు క్యాలిక్యులేటర్లు, సెల్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకుని వెళ్లకూడదు.
➥ పరీక్షా కేంద్రాల్లో నిర్దేశించిన సీట్లలో మాత్రమే విద్యార్ధులు కూర్చుని పరీక్షలు రాయాలి.
➥ మాల్ ప్రాక్ట్రీస్, కాపీయింగ్‌ను ప్రోత్సహించిన యాజమాన్యాలపై సెక్షన్ -25 ప్రకారం కఠిన చర్యలు తీసుకొంటారు.
➥ ప్రతీ పరీక్ష కేంద్రాల వద్ద 144వ సెక్షన్ అమల్లో ఉంటుంది.
ఇంటర్ పరీక్షల షెడ్యూలు ఇలా..
ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ షెడ్యూలు..
➥ మార్చి 1- శుక్రవారం – సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1
➥ మార్చి 4 – సోమవారం – ఇంగ్లిష్ పేపర్-1
➥ మార్చి 6 – బుధవారం – మ్యాథ్స్ పేపర్-1ఎ, బోటనీ పేపర్-1, సివిక్స్-1.
➥ మార్చి 9 – శనివారం – మ్యాథ్స్ పేపర్-1బి, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1
➥ మార్చి 12 – మంగళవారం – ఫిజిక్స్ పేపర్-1, ఎకనావిుక్స్ పేపర్-1
➥ మార్చి 14 – గురువారం – కెవిుస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1, సోషియాలజీ పేపర్-1, ఫైన్ ఆర్ట్స్& మ్యూజిక్ పేపర్-1
➥ మార్చి 16 – శనివారం – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, లాజిక్ పేపర్-1, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్-1 (బైపీసీ విద్యార్థులకు).
➥ మార్చి 19 – మంగళవారం – మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జియోగ్రఫీ పేపర్-1
ఇంటర్ సెకండియర్ ఎగ్జామ్స్ షెడ్యూలు..
➥ మార్చి 2 – శనివారం – సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2
➥ మార్చి 5 – మంగళవారం – ఇంగ్లిష్ పేపర్-2
➥ మార్చి 7 – గురువారం – మ్యాథ్స్ పేపర్-2ఎ, బోటనీ, సివిక్స్-2.
➥ మార్చి 11 – సోమవారం – మ్యాథ్స్ పేపర్-2బి, జువాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2.
➥ మార్చి 13 – బుధవారం – ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్ పేపర్-2.
➥ మార్చి 15 – శుక్రవారం – కెవిుస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్-2, సోషియాలజీ పేపర్-2, ఫైన్ ఆర్ట్స్& మ్యూజిక్ పేపర్-2
➥ మార్చి 18 – సోమవారం – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2, లాజిక్ పేపర్-2, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్-2 (బైపీసీ విద్యార్థులకు).
➥ మార్చి 20 – బుధవారం – మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2, జియోగ్రఫీ పేపర్-2