✳️ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా,నిర్భయంగా వినియోగించుకోవాలి. – జిల్లా ఎస్పి…
6th sense TV: అమలాపురం:సార్వత్రిక ఎన్నికలు-2024 నేపథ్యంలో Dr BR Ambedkar కోనసీమ జిల్లాకు చేరుకున్న కేంద్ర పోలీసు బలగాలు.- జిల్లా ఎస్పి శ్రీ ఎస్. శ్రీధర్ IPS గారి పర్యవేక్షణలో kothapeta డీఎస్పీ గారి ఆధ్వర్యంలో
✳️ఎన్నికల విషయమై ప్రజలకు భరోసా కల్పించుటకు కేంద్ర పోలీసు బలగాల ఫ్లాగ్ మార్చ్.
✳️రానున్న ఎన్నికల సమయంలో కేంద్ర పోలీసు దళాలు, జిల్లా పోలీసులు సమన్వయంగా పని చేయాలి.
రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు కేంద్ర పోలీసు బలగాలు చేరుకున్నాయి. ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు దళాలు, జిల్లా పోలీసులు సమన్వయంగా పని చేయాలని జిల్లా ఎస్పీ శ్రీ S. Sreedhar గారు పేర్కొన్నారు. కేంద్ర పోలీసు దళాలు జిల్లాకు వచ్చిన సందర్భంగా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ రోజు Dr. Ambedkar కోనసీమ జిల్లాలోనీ kothapeta పోలీసు సబ్ డివిజన్ పరిధిలలోని సమస్యాతకంగా పోలింగ్ స్టేషన్ లు, సమస్యత్మగా గ్రామాలలో స్థానిక పోలీసులు కేంద్ర బలగాలు సంయుక్తంగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు స్పందిస్తూ జిల్లా యొక్క భౌగోళిక పరిస్థితులు, అసెంబ్లీ ,పార్లమెంటు స్థానాలు తదితర అంశాలపై పోలీసు బలగాలు అవగాహన కలిగి ఉండాలని తెలియజేసారు. ఎన్నికలు సజావుగా,ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అధికారులు,సిబ్బంది అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఒక టీం లాగా సమన్వయం చేసుకొని ఎన్నికలు విధులు నిర్వహించాలని ఎస్పీ తెలిపారు. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి పౌరుడు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించు కునేందుకు, పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని, సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాల్లో మరింత అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు.