పోస్ట్ ఆఫీస్ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం…?
6th sense TV:కాకినాడ జిల్లా: కాకినాడ సిటీ:
ఆంధ్ర ప్రదేశ్ చీఫ్ పోస్ట్మాస్టర్ జనరల్ వారి ఆదేశాన్ని ప్రకారం ఈ రోజు ది 21-08-2024 న సాయంత్రం 4 గంటలకు కాకినాడ హెడ్ పోస్ట్ ఆఫీస్ ఆవరణలో డాక్ చౌపాల్ (పోస్ట్ ఆఫీస్ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం) అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కాకినాడ పోస్టల్ సూపరింటెండెంట్ గారైన శ్రీ చుక్క శ్రీనివాసరావు గారు అధ్యక్షత వహించారు. విశిష్ట అతిథిగా శ్రీ జి.శివనాగరాజు గారు, అసిస్టెంట్ డైరెక్టర్ (ఆర్థిక లావాదేవీలు) ఆంధ్రప్రదేశ్ సర్కిల్ వారు విచ్చేసినారు. తపాల సిబ్బంది అందరూ కాకినాడ ప్రధాన తపాల కార్యాలయం నుండి మసీదు సెంటర్ మీదుగా సినిమా హాలు రోడ్డు మొదలగు ప్రాంతాలను కలుపుతూ ఒక భారీ ర్యాలీని నిర్వహించారు. ముందుగా విశిష్ట అతిథి గారి చేతులమీదుగా ప్రారంభించబడిన ర్యాలీ అద్భుతమైన విజయం సాధించింది.
ఈ ర్యాలీలో శ్రీ జి.శివనాగ రాజు గారు, అసిస్టెంట్ డైరక్టర్ గారు, పోస్టల్ సూపరింటెండెంట్ గారైన చుక్కా శ్రీనివాసరావు గారు, అసిస్టెంట్ సూపరింటెండెంట్ గారైన శ్రీ గంటి రామకృష్ణ గారు, అసిస్టెంట్ సూపరింటెండెంట్ గారైన శ్రీ అవసరాల శ్రీనివాసరావు గారు, అసిస్టెంట్ సూపరింటెండెంట్ గారైన శ్రీ డి.అనిల్ అంబేద్కర్ కుమార్ గారు, పోస్టల్ ఇన్స్పెక్టర్ శ్రీ బోను జగదీష్ గారు, పోస్టల్ ఇన్స్పెక్టర్ శ్రీ సూర్యప్రకాశరావు గారు , పోస్టల్ ఇన్స్పెక్టర్ శ్రీ లెక్కల నాయుడు గారు మరియు కాకినాడ డివిజన్ పోస్టల్ సిబ్బంది, పోస్ట్ మాన్లు, పోస్ట్ ఉమెన్లు, PLI డైరెక్ట్ ఏజెంట్స్, IPPB సీనియర్ మేనేజర్ శ్రీ రాజ్ కుమార్ గారు, అసిస్టెంట్ మేనేజర్ శ్రీ బాలాజీ గారు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఈ ర్యాలీ కి ప్రజల నుండి అనూహ్యమైన స్పందన లభించింది. ఈ ర్యాలీ కి సహకరించిన పోలీసు డిపార్ట్మెంట్ వారికి , పోస్టల్ సిబ్బందికి మరియు కాకినాడ పట్టణ ప్రజలకు, పోస్టల్ సూపరింటెండెంట్ గారైన శ్రీ చుక్క శ్రీనివాసరావు గారు ధన్యవాదములు తెలియజేసారు. ఈ రోజు కాకినాడ డివిజన్ పరిధిలో ఏడు లక్షల కొత్త ప్రీమియం ఈరోజు సాధించడం జరిగింది.
(శ్రీ చుక్క శ్రీనివాసరావు గారు )
పోస్టల్ సూపరింటెండెంట్
కాకినాడ పోస్టల్ డివిజన్
కాకినాడ – 533001