ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన ట్రాఫిక్ -1 సిఐ రమేష్

6th sense TV:కాకినాడ నగరం పరిసర ప్రాంతాల్లో పాఠశాల విద్యార్థులను ఆటోల్లో మితిమీరిన వేగంతో పాటు అధిక మందిని ఎక్కించుకుని వెళ్తున్న ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించిన ట్రాఫిక్ -1 సిఐ రమేష్.. ఈ కార్యక్రమంలో ఎస్సై కిషోర్, A.S.I మూర్తి, హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ పాల్గొన్నారు

విశ్రాంత  న్యాయమూర్తికే టోకరా….?

6th sense TV:హైదరాబాద్: | కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి విరాళాల పేరుతో మోసం. రాజకీయ పార్టీకి బాండ్ల ద్వారా విరాళం ఇవ్వడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు అని మాయమాటలు. ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ డీ ఎస్ ఆర్ వర్మ కుటుంబం వద్ద నుంచి రెండున్నర కోట్లు వసూలు చేసిన నరేంద్ర, కసిరెడ్డి శరత్ రెడ్డి అనే వ్యక్తులు. రెండేళ్లు గడిచినా బాండ్లకు సంబంధించిన రశీదులు ఇవ్వని కేటు గాళ్ళు. బాండ్ల పేరుతో విరాళాలు […]

ఆటో లో యువతి ని కిడ్నాప్ కు యత్నం…

6th sense TV:విశాఖ: విశాఖ నగరంలో మరో దారుణ ఘటన… ఆటో డ్రైవర్ యువతిని కిడ్నప్ చేసేందుకు ప్రయత్నం చేయడం తో ఆటో లో నుండి దూకేసిన యువతి.. యువతని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నం చేసిన ఆటో డ్రైవర్ పరార్. యువతి కి తీవ్ర గాయాలు.. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న యువతి.. నిందితుడు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

రుషికొండ భవనాలు ప్రారంభం?

6th sense TV:AP: విశాఖలోని రుషికొండలో పర్యాటక శాఖ నిర్మించిన భవన సముదాయాలను రేపు ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. రూ.450 కోట్లతో 8 బ్లాక్లుగా వీటిని తీర్చిదిద్దారు. ఇక్కడే సీఎంవో క్యాంపు కార్యాలయం కూడా నిర్మించారు. కాగా ఈ ప్రాజెక్టుపై పలు కేసులు హైకోర్టులో పెండింగ్లో ఉండగానే ప్రారంభోత్సవానికి సిద్ధమవడంతో ప్రజల్లో ఆసక్తి నెలకొంది.

ఎమ్మెల్యే ద్వారంపూడి.నా వ్యాఖ్యలు రాజకీయం చేయొద్దు:

6th sense TV:కాకినాడ :ఈనెల 17న పత్రికా సమావేశంలో మత్స్యకార జాతిపై తాను పొరబాటున చేసిన వ్యాఖ్యలపై రాజకీయం చేయొద్దని కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి అన్నారు.తన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నానని కాకినాడలో అన్ని కులాలు,మతాలు ప్రజలు అంతా తనకు సమానమేనన్నారు. మత్స్యకార వర్గం అభివృద్ధికి ఎంతో పాటుపడుతున్నానని అన్నారు.తన వ్యాఖ్యల పట్ల మనస్ఫూర్తిగా క్షమాపణలు చెపుతున్నానన్నారు.అన్యధా భావించవద్దని,ఎన్నికల సమయంలో ఈ వ్యాఖ్యలపై కొంతమంది రాద్ధాంతం చేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు.కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రి […]

ఆర్కే బీచ్ లో పర్యాటకులకు తప్పిన పెను ప్రమాదం…

6th sense TV:విశాఖపట్నం: రెండో రోజే తెగిపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జి… సముద్రం లోకి 100 మీటర్లు దూరం కొట్టుకుపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జి, చివరి ఫ్లాట్ ఫామ్ భాగం అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో ఎవరు లేకపోవడంతో తప్పిన ప్రమాదం… ఫ్లోటింగ్ బ్రిడ్జి తెగిపోవడంతో ఎక్కాలంటే భయబ్రాంతులకు గురవుతున్న పర్యాటకులు… నిన్న అట్టహాసంగా ఆర్కే బీచ్ లో ఫ్లోటింగ్ బ్రిడ్జి ను ప్రారంభించిన రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి, మంత్రులు అమరనాథ్… కోట్ల రూపాయలుతో ఏర్పాటుచేసిన ప్రభుత్వం

బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తు ఖరారు అయితే…?

బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తు ఖరారు అయితే… 3 వ తేదీన ఉమ్మడి జాబితా…. బీజేపీతో పొత్తు జాప్యం అయితే టీడీపీ, జనసేన జాబితా విడుదల. మూడు పార్టీలు కలిపి 45తో మంది జాబితా. టీడీపీ..జనసేన అయితే 25తో మంది జాబితా. 10 వ తేదీ లోపు..మూడు పార్టీల కలిపి ఫైనల్ జాబితా విడుదల.

వారంలోగా ఎమ్మెల్యే ద్వారంపూడి క్షమాపణ చెప్పాలి….,?

మత్స్యకార నేతల అల్టిమేటం….___ ___   6th sense TV:కాకినాడ, ఫిబ్రవరి 26: కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మత్స్యకారులపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై వారంలోగా క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామంటూ మత్స్యకారులు అల్టిమేటం జారీ చేశారు. మత్స్యకారులను దోపిడీదారులంటూ చేసిన వ్యాఖ్యలను ద్వారంపూడి నేటి వరకు వాటిని వెనక్కి తీసుకోకపోగా ఇంకా అహంకారంతోనే విర్రవీగుతున్నాడని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం కాకినాడలోని బాలాజీ చెరువు సెంటర్లో ఉన్న కాస్మోపాలిటన్ […]

టి.యు-142ఎం ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ను ప్రారంబించిన ….

6th sense TV:కాకినాడ రూరల్, సూర్యారావుపేటలోని బీచ్ వద్ద నూతనంగా ₹9.కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన *టి.యు-142ఎం  ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం* ను ప్రారంబించిన *కాకినాడ రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, వై.ఎస్.అర్ కాంగ్రేస్ పార్టి కాకినాడ జిల్లా అధ్యక్షులు  శ్రీ కురసాల కన్నబాబు* గారు, *కాకినాడ సిటీ శాసనసభ్యులు శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి* గారు, *కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి వంగా గీతావిశ్వనాధ్* గారు, *ఎం.ఎల్.సి శ్రీమతి కర్రి పద్మశ్రీ* గారు, *కుడా […]