24 సీట్లేనా అనుకోవద్దు..

6th sense TV అమరావతి:98 శాతం స్ట్రైక్ రేట్ కోసమే ఈ సీట్లు తీసుకున్నట్లు వెల్లడి పోటీ చేసిన ప్రతీ చోటా జనసేనను గెలిపించుకోవాలని పిలుపు 3 పార్లమెంట్ సీట్లను కలుపుకుంటే 40 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లేనని వివరణ అప్పట్లో ఓ పది సీట్లన్నా గెలుచుకుని ఉంటే ఇప్పుడు ఎక్కువ అడిగే వాళ్లమన్న జనసేనాని

జనసేన పార్టీ పోటీ చేయబోయే నియోజకవర్గాలు అభ్యర్థుల వివరాలు….

6th sense TV అమరావతి :జనసేన పార్టీ పోటీ చేయబోయే నియోజకవర్గాలు అభ్యర్థుల వివరాలు తెనాలి – శ్రీ నాదెండ్ల మనోహర్ గారు.నెల్లిమర్ల – శ్రీమతి లోకం మాధవి గారుఅనకాపల్లి – శ్రీ కొణతాల రామకృష్ణ గారురాజానగరం – శ్రీ బత్తుల బలరామ కృష్ణ గారుకాకినాడ రూరల్ – శ్రీ పంతం నానాజీ గారు ఇతర నియోజకవర్గాల వివరాలు, అభ్యర్థుల పేర్లు 2 రోజుల్లో ప్రకటిస్తాను – #JanaSenaParty అధినేత శ్రీ #PawanKalyan గారు.

ఈసారి వివేకాను చంపిందెవరో చెప్పి జగన్‌ ఓట్లుఅడగాలి: దస్తగిరివ్యాఖ్యలు….

కడప జైలు నుంచి బెయిల్ పై విడుదలైన దస్తగిరి వ్యాఖ్యలు చావడానికైనా సిద్ధమే గానీ.. సీఎం జగన్‌, ఎంపీ అవినాష్‌రెడ్డిల బెదిరింపులకు తలొగ్గేది లేదని మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి స్పష్టం చేశారు. పులివెందులలో ఎంపీ అవినాష్‌రెడ్డి ఇంటి పక్కనే తాను నివాసం ఉంటానని, ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. వివేకా హత్యకు సంబంధించి తప్పుచేసి ప్రాయశ్చిత్తంతో అప్రూవర్‌గా మారానని, ఇప్పుడు సీఎం, ఎంపీల మాటలు విని మళ్లీ […]

గ్రామీణ ఉపాధి హామీ 200 రోజులు పని దినాలు 600రూపాయలు వేతనం పెంచాలని……

6th sense tv,కాకినాడ రూరల్ ఫిబ్రవరి 24 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టండిరాజకీయ పార్టీలకు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు డిమాండ్ కాకినాడ జిల్లాలో వ్యవసాయ కార్మిక సంఘం సభ్యత్వాలు చేర్పిస్తున్న జిల్లా నాయకులు కాకినాడ రూరల్ ఫిబ్రవరి 24:శ్రమను నమ్ముకుని రెక్కలు ముక్కలుగా చేసుకుని కడుపు నింపుకుంటున్న కష్టజీవులకుకోనేరు రంగారావు కమిటీ సిఫార్సులు మేరకు భూ పంపిణీ చేయాలని గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసి 200 రోజులు పని […]

ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ భేటీ

అమరావతి: జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో శుక్రవారం మంత్రుల కమిటీ చర్చలు చేపట్టింది. 16 ఉద్యోగ సంఘాలతో మంత్రి బొత్స, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ జవహర్‌రెడ్డి సమావేశమయ్యారు. పీఆర్సీ బకాయిలు, పెండింగ్‌ డీఏలపై ఈ భేటీలో చర్చించారు. డిమాండ్ల పరిష్కారానికి ఈ నెల 27న చలో విజయవాడకు ఏపీ ఐకాస పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ అత్యవసరంగా భేటీ అయింది. ఉద్యోగులకు […]

ఐఏఎస్‌ అధికారి జన్నత్‌ హుస్సేన్‌ కన్నుమూసారు….

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చీఫ్‌ సెక్రటరీగా పనిచేసిన విశ్రాంతి ఐఏఎస్‌ అధికారి జన్నత్‌ హుస్సేన్‌ కన్నుమూసారు శుక్రవారం తెల్లవారుజామున తన నివాస గృహంలో తుదిశ్వాస విడిచారు.వైఎస్సార్‌ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే టైంలో.. ఉచిత విద్యుత్‌ ఫైల్‌పై సంతకం చేశారు. ఆనాడు ఆ ఫైల్‌ అందించింది ఈయనే. అంతేకాదు.నాడు ఉచిత విద్యుత్తు ప‌థ‌కం విధివిధానాల్ని ప్రిన్సిపల్‌ చీఫ్‌ సెక్రటరీ హోదాలో హుస్సేను రూపొందించారు.

రూరల్ వైసిపికి నిరుత్సాహ సెగ!

కాకినాడ గ్రామీణం. తూరంగి మాజీ సర్పంచ్, వైకాపా సీనియర్ నాయకుడు బలగం ప్రసన్న కుమార్ వైకాపా పార్టీకి రాజీనామా చేసినట్లు సమాచారం.! సుమారు 15 ఏళ్లగా కన్నబాబు గెలుపుకు కారణమైన బలగం ప్రసన్నకుమార్ గుర్తింపు లేక నిరుత్సాహంతో పార్టీకి రాజీనామా. బొజ్జగింపుల పర్వం మొదలుపెట్టిన కన్నబాబు. ఇదేవిధంగా చాలామంది నిరుత్సాహంతో ఉన్నట్లు తెలుస్తోంది.

ఆపదలో ఉన్నవారు.. సహాయం కోరేవారు.. మాత్రమే పోలీస్ స్టేషన్కు వస్తారు..

తిరుపతి జిల్లా…ఎస్పీ మలిక గర్గ్, చంద్రగిరి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ మలిక గర్గ్, ఆపదలో ఉన్నవారు.. సహాయం కోరేవారు.. మాత్రమే పోలీస్ స్టేషన్కు వస్తారు.. వారి నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మనదే.విజిబుల్ పోలీసింగ్ ద్వారా ఎన్ఫోర్స్మెంట్ విధులను పెంచాలి.చంద్రగిరి నియోజకవర్గం చాలా సున్నితమైన ప్రాంతం.. సార్వత్రిక ఎన్నికలు-2024 దృష్ట్యా పాత నేరస్తులు బైండోవర్.భాకరాపేట ఘాట్ రోడ్డు లో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ అమలు.చిత్తూరు-తిరుపతి హైవే రహదారి వెంబడి […]

   షర్మిల పై పోలీసుల ఉక్కుపాదం!

YSR ఆత్మ క్షోభిస్తుంది: షర్మిల అమరావతి:- AP: ఆడబిడ్డనని కూడా చూడకుండా తనను అరెస్ట్ చేశారని YS షర్మిల మండిపడ్డారు. ‘ఇదంతా చూసి YSR ఆత్మ క్షోభిస్తుంది. అమ్మ బాధపడుతుంది. సచివాలయంలో సీఎం, మంత్రులు ఉండరు. ఆత్మహత్యలు చేసుకుంటున్న నిరుద్యోగ బిడ్డల కోసమే నా పోరాటం. నోటిఫికేషన్లు ఇవ్వడం కూడా ఈ ప్రభుత్వానికి చేతకాదు. ఇదేనా రాజశేఖర్ రెడ్డి వారసత్వం అంటే? కనీసం కనికరం లేకుండా నన్ను రాత్రంతా పార్టీ ఆఫీసులోనే ఉండేలా చేశారు’ అని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరైంది….

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరైంది. 2018 నాటి పరువు నష్టం కేసులో రాహుల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ సుల్తాన్‌పూర్‌లోని ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. కాగా, ఎన్నికల ప్రచార సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై రాహుల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని విజయ్ మిశ్రా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు..