*సెల్ఫీ పిచ్చి ప్రాణం మీదకు తేచ్చే*

6th sense TV:వేములపల్లి *సాగర్ ఎడమ కాలువ వేములపల్లి బ్రిడ్జి వద్ద ఓ మహిళ సెల్ఫ్ దిగుతూ కాలుజారి   నీటిలో పడడం జరిగింది*అటుగా వెళుతున్న స్థానికులు గజలపురం  గ్రామానికి చెందిన యువకులు జక్క నాగయ్య, జక్కా నాగరాజు, మరియు తదితరులు . వెంటనే నీటిలో దూకి తాడు సాయంతో ఆమెను సురక్షితంగా ఒడ్డుకు చేర్చి కాపాడడం  జరిగింది.

రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం బయట సినిమా తరహాలో కిడ్నాప్..‌.?

6th sense TV: తూర్పుగోదావరి జిల్లా: రాజమహేంద్రవరం:ఒక కేసులో తుని కోర్టు నిందితులకు బెయిల్ ఇవ్వడంతో ఈరోజు బెయిల్ పై రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుండి వాళ్ళు బయటకు వస్తుండగా సినిమా తరహాలో వారిలో ఒక నిందితుడు ని కొందరు దుండగలు కారులో వచ్చి అందరూ చూస్తుండగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన దృశ్యం… న్యాయవాది  దీనిపై స్థానిక పోలీసులకు పిర్యాదు ఇవ్వడం జరిగింది.

సేఫ్టీ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాం లో భాగంగా ….

6th sense TV కాకినాడ జిల్లా: కాకినాడ:ఈరోజు (28.08.2024) వ తేదీన,  గౌరవనీయులైన కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్  ఐపిఎస్., గారి   ఉత్తర్వులు మేరకు మరియు  కాకినాడ SDPO  శ్రీ  రఘువీర్ విష్ణు గారి పర్యవేక్షణలో *కాకినాడ  P.R జూనియర్  లేజీ నందు విదార్థిని, విద్యార్థులకు* ట్రాఫిక్ -1 ఇన్స్పెక్టర్ శ్రీ N .రమేష్ గారు మరియు ట్రాఫిక్-1&2 SIs వారి సిబ్బంది నిర్వహించిన  రోడ్ సేఫ్టీ ట్రాఫిక్  అవేర్నెస్ ప్రోగ్రాం లో భాగంగా […]

ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 3 నుంచి దసరా * మహోత్సవాలు*

6th sense TV:విజయవాడ : విజయవాడ ఇంద్రకీలాద్రి పై అక్టోబర్ 3 నుంచి 12 వరకు దసరా మహోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా *అక్టోబర్ 3న బాలా త్రిపుర సుందరీదేవిగా*4న గాయత్రీదేవిగా *5న అన్నపూర్ణ దేవిగా*6న లలితా త్రిపుర సుందరీదేవిగా *7న మహాచండీ గా *8న మహాలక్ష్మీ దేవి గా *9న సరస్వతి దేవిగా*10న దుర్గాదేవిగా *11న మహిషాసురమర్దిని, *12న రాజరాజేశ్వరీ దేవిగాఅమ్మవారిని అలంకరిస్తారు. భక్తులకు ఇబ్బంది లేకుండా పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో రామారావు తెలిపారు.

సారా బట్టిపై పోలీసులు దాడి..

6th sense TV:జె.కొత్తూరు: కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జె.కొత్తూరు గ్రామ శివారున  నిర్వహిస్తున్న సారా బట్టిపై పోలీసులు దాడులు నిర్వహించారు… అక్రమంగా సారా బట్టి నిర్వహిస్తున్నట్లు జగ్గంపేట ఎస్సై టి. రఘునాధరావుకు వచ్చిన సమాచారం మేరకు మంగళవారం తెల్లవారుజామున ఎస్సై తన సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 600 లీటర్ల బెల్లపు ఉటను ధ్వంసం చేయడం జరిగిందని ఎస్ఐ తెలిపారు. అదేవిధంగా అక్రమంగా సారా తయారీకి పాల్పడుతున్న కేసు బోయిన వీర్రాజు అనే వ్యక్తిని […]

అచ్యుతాపురం సెజ్ ప్రమాద.   బాధితులను ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు…..

6th sense TVవిశాఖపట్నం: *ఉత్తమ వైద్య సేవలందిస్తాం. అవసరమైన వారికి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయిస్తాం.* విశాఖపట్నం చేరుకున్న ఆయన.. నేరుగా మెడికవర్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులతోనూ మాట్లాడి త్వరగా కోలుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని.. మేము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. భయపడకుండా ధైర్యంగా ఉండాలని సూచించారు. అనంతరం బాధితుల కుటుంబసభ్యులతో మాట్లాడారు. ఆ తర్వాత ఆస్పత్రి వెలుపల […]

కేటుగాళ్లు ‘పుష్ప’ క్రియేటివిటీని చూపిస్తూ.. రాష్ట్ర సరిహద్దులను దాటిస్తున్నారు…?

6th sense TV: కడప జిల్లా: పొద్దుటూరు:గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణా అడ్డుకట్టకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినప్పటికీ.. కేటుగాళ్లు ‘పుష్ప’ క్రియేటివిటీని చూపిస్తూ.. రాష్ట్ర సరిహద్దులను దాటిస్తున్నారు. అయితే పోలీసులు ఏమైనా తక్కువా.. వారిని పక్కా ప్రూఫ్స్‌తో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నారు. ఇటీవల కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో భారీ మొత్తంలో గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. సాధారణ వెహికిల్ చెకింగ్ చేస్తోన్న ఖాకీలకు.. పూతరేకుల పార్శిళ్లల్లో అక్రమంగా తరలిస్తున్న గంజాయి బయటపడింది. కొవ్వూరు గ్యారేజ్‌లోని […]

పోస్ట్ ఆఫీస్ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం…?

6th sense TV:కాకినాడ జిల్లా: కాకినాడ సిటీ: ఆంధ్ర ప్రదేశ్ చీఫ్ పోస్ట్మాస్టర్ జనరల్ వారి ఆదేశాన్ని ప్రకారం ఈ రోజు ది 21-08-2024 న సాయంత్రం 4 గంటలకు కాకినాడ హెడ్ పోస్ట్ ఆఫీస్ ఆవరణలో డాక్ చౌపాల్ (పోస్ట్ ఆఫీస్ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం) అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కాకినాడ పోస్టల్ సూపరింటెండెంట్ గారైన శ్రీ చుక్క శ్రీనివాసరావు గారు అధ్యక్షత వహించారు.  విశిష్ట అతిథిగా శ్రీ జి.శివనాగరాజు గారు, […]

కాకినాడ భానుగుడి సెంటర్లో “ఐ” హాస్పిటల్ ప్రారంభించిన టూరిజం అండ్ సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు కందులు దుర్గేష్…కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ….

6th sense TV: కాకినాడ జిల్లా:కాకినాడ భానుగుడి సెంటర్లో డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ ప్రారంభించిన టూరిజం అండ్ సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు కందులు దుర్గేష్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు .