పనుల నాణ్యతలో రాజీ వద్దు : డిప్యూటీ సీఎం….
6th sense TV: ఆంధ్ర ప్రదేశ్:AP : ఉపాధి హామీ పనుల నాణ్యతలో రాజీ వద్దని.. ప్రతి దశలోనూ నాణ్యతా ప్రమాణాలు తనిఖీ చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఉపాధి హామీతోపాటు 15వ ఆర్థిక సంఘం నుంచి నిధులు వచ్చాయన్నారు. వాటిని సక్రమంగా, పారదర్శకంగా సద్వినియోగం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు.