21,37,500 /- లు విలువ గల 25000 కేజీల…?
రాజమహేంద్రవరం:రీజనల్ విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ అధికారి వారి కార్యాలయము,
ఈ రోజు అనగా దివి.05.03.2024వ తేదీన డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆలమూరు మండలం మరియు గ్రామములోని కళ్యాణ్ చక్రవర్తి వే బ్రిడ్జ్ సమీపములో అశోక్ లేలాండ్ లారీ వాహనం నంబర్ AP16 TY 6542 లో పి.డి.ఎస్(రేషన్ బియ్యం)తో వెళ్ళుతుంది అన్న సమాచారముతో విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ మరియు సివిల్ సప్లయ్స్ అధికారులతో సదరు వాహనంను అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా, సదరు వాహనం నందు గల 460 తెలుపు రంగు ప్లాస్టిక్ బస్తాలు మరియు 40 ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ కు చెందిన గోనె సంచులు మొత్తం 500 బస్తాలలో సుమారు 25000 కేజీల పి.డి.ఎస్ బియ్యంను గుర్తించటమైనది. సదరు పి.డి.ఎస్ బియ్యంను డ్రైవరు పెద్దిరెడ్డి రాజేష్ వారు కృష్ణా జిల్లా పామర్రు గ్రామంలోని శ్రీ గౌతమి రైస్ అండ్ ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ యజమాని అయ్యిన శ్రీ గొట్టేపు రమేష్ బాబు నుండి కాకినాడకు చెందిన వి. శ్రీనివాసరావుకు రవాణా చేయుచున్నాడు. సదరు పి.డి.ఎస్ బియ్యంను అక్రమముగా తరలించుట కారణముగా సుమారు రూ 21,37,500 /- లు విలువ గల 25000 కేజీల పి.డి.ఎస్(రేషన్ బియ్యం)ను మరియు పైన తెలిపిన వాహనంను సివిల్ సప్లయ్స్ అధికారులు, ఆలమూరు వారు సీజ్ చేసి 6-ఏ క్రింద కేసు నమోదు చేసి సదరు పి.డి.ఎస్(రేషన్ బియ్యం) ఓనర్లు, వాహనం డ్రైవర్, యజమాని మరియు సంబందిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు కొరకు పోలీసు స్టేషన్ కు సిఫారసు చేయటమైనది.
ఈ సందర్భముగా రీజనల్ విజిలెన్స్ ఎస్.పి. శ్రీ కె.ఎస్.ఎస్.వి.సుబ్బారెడ్డి, ఐ.పి.ఎస్ గారు మాట్లాడుతూ రాజమహేంద్రవరం రీజనల్ విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ పరిధిలోని మూడు జిల్లాలలో పి.డి.ఎస్(చౌక బియ్యం) అక్రమ నిల్వలు, అక్రమ రవాణా పై నిరంతరం నిఘా కొనసాగుతుంది అని, ఎవ్వరైనా పి.డి.ఎస్(చౌక బియ్యం) కొనడం, అమ్మడం చేస్తే సదరు వ్యక్తుల పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని తెలిపియున్నారు.
ఈ తనిఖిలలో విజిలెన్స్ అధికారులు శ్రీనివాసరెడ్డి, భార్గవ మహేష్, సి.ఎస్.డి.టి అలిషా మరియు రెవెన్యూ, సివిల్ సప్లయ్స్ అధికారులు పాల్గొన్నారు .