27న ‘ఛలో విజయవాడ’ఏపీ జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాసరావు,,,,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 27న ‘ఛలో విజయవాడ’ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఏపీ జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాసరావు తెలిపారు. దీనికి ఉద్యోగులంతా తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆ రోజు ఉద్యోగుల విశ్వరూపం చూస్తారని ఆయన హెచ్చరించారు. 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, ఇతర సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వ పెద్దలు ఏర్పాటు చేస్తున్న సమావేశాలు చాయ్, బిస్కెట్లకే పరిమితం అయ్యాయని దుయ్యబట్టారు.