6 గంటలలోనే పోయిన బ్యాగ్ ను ఛేదించిన కంచికచర్ల పోలీసులు…
6 గంటలలోనే పోయిన బ్యాగ్ ను ఛేదించిన కంచికచర్ల పోలీసులు
సోషల్ మీడియాలో వచ్చిన న్యూస్ పై స్పందించిన కంచికచర్ల పోలీసులు…
సోషల్ మీడియాలో విజయవాడ నుండి జగ్గయ్యపేట వెళ్ళే ఆర్టీసీ బస్సులో 60 గ్రాముల బంగారం చోరీ అని వచ్చిన న్యూస్…
వెంటనే అప్రమత్తమైన కంచికచర్ల పోలీసులు రెండు టీములుగా విడిపోయి 6 గంటల్లోనే మిస్ అయిన బ్యాగును పట్టుకున్నారు…
పసల ఉదయమేరి చీరాల పట్టణం నుండి నందిగామ పట్టణానికి పెళ్లి కి వస్తూ,60 గ్రాముల బంగారం ఉన్న బ్యాగ్ ను బస్సులో పెట్టి నందిగామ వెళుతున్నారు, బస్సు కంచికచర్ల బస్టాండు దాటిన తర్వాత బాధితులు బ్యాగులు చూసుకొనగా బస్సులో బ్యాగు కనిపించ లేదని గుర్తించిన బాధితులు…
బ్యాగ్ పోయిందని తెలుసుకున్న వెంటనే పోలీసులు అప్రమత్తమై, బాధితులకు బంగారం, బ్యాగును అందజేసిన పోలీసులు…
పోలీసులు స్పందించిన తీరు చాలా అద్భుతమని చెబుతున్న బాధితులు…
ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులతో చేయించుకున్న బంగారం పోయిన వెంటనే పోలీసులు స్పందించిన తీరు వారు మాతో మాట్లాడిన విధానం కంచికచర్ల పోలీసులను జీవితాంతం గుర్తుంచుకుంటామని NTR జిల్లా పోలీస్ కమిషనర్ గారికి, DCP గారికి, ACP గారికి, CI గారికి, SI గారికి మరియు వారి సిబ్బందికి బాధితులు కృతజ్ఞతలు తెలియజేశారు…