సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మద్యం, నగదు, మాదక ద్రవ్యాలు ఇతర…?
6th sense TV:జిల్లా పోలీస్ కార్యాలయం, కాకినాడ,
రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మద్యం, నగదు అక్రమ రవాణా నిరోధించడానికి గాను యానం జిల్లా ఎస్పీ గారితో సమావేశమైన కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, ఐపిఎస్.
ఈరోజు అనగా మధ్యాహ్నం కాకినాడ జిల్లా ఎస్పీ గారు కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయం నందు సమావేశ మందిరంలో యానం జిల్లా ఎస్పీ శ్రీ రాజశేఖరన్, కాకినాడ జిల్లా SEB అదనపు ఎస్పీ శ్రీమతి. శ్రీలక్ష్మీ , SEB, EXCISE సూపరింటెండెంట్లు, సబ్ డివిజనల్ పోలీసు అధికారి డా. హనుమంతరావు, కాకినాడ రూరల్ ఇన్స్పెక్టర్, SEB ఇన్స్పెక్టర్లు, ఎస్సైలతో సమావేశం కావడం జరిగినది.
ఈ సమావేశంలో రానున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మద్యం, నగదు, మాదక ద్రవ్యాలు ఇతర అక్రమ రవాణాలను నిరోధించుటకుగాను పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించడం జరిగింది.
ఈ ఏర్పాట్లలో భాగంగా కాకినాడ జిల్లా కోరంగి పోలీస్ స్టేషన్ పరిధిలో మరియు యానం పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని ముఖ్యమైన రోడ్లలోను, ఇతర చిన్న రోడ్లలో ఇప్పుడు ఉన్న చెక్ పోస్టులకు అధనముగా మరికొన్ని చెక్ పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించాలని మరియు ఫ్లయింగ్ స్క్వాడ్స్, మొబైల్ చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని, పటిస్టమైన సమాచార వ్యవస్థ నెలకొల్పాలని, పరస్పర సమాచార మార్పిడి ద్వారా అక్రమరవాణాను నిరోధించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది.