స్థానికుడునైన తనకు….
6th sense TV:సామర్లకోట:రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే ఆభ్యర్ధిగా పోటీచేస్తున్న స్థానికుడునైన తనను ప్రజలు ఆశీర్వదించాలని నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ దవులూరి దొరబాబు పేర్కొన్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా ముందుగా సామర్లకోట జగనన్న కాలనీ వద్ద గల రాజశేఖర రెడ్డి విగ్రహానికి దొరబాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.. అనంతరం ఆయన ప్రచారం ప్రారంభించారు..40 సంవత్సరాల తరువాత స్థానికుడునైన తనకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించారని రానున్న ఎన్నికల్లో తనను గెలిపించాలని ప్రతీ ఇంటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.