*పోకిరీల చిల్లర చేష్టలు.. ప్రాణాలతో చెలగాటం*
సోషల్ మీడియాలో హీరోలయ్యేందుకు కొంతమంది ప్రాణాలను లెక్క చేయకుండా పిచ్చి పనులు చేస్తున్నారు. ఇద్దరు యువకులు స్కేటింగ్ షూ వేసుకుని రోడ్డుపై స్టంట్స్ చేసిన వీడియో వైరలవుతోంది. ట్రక్కును పట్టుకుని ఒకరు వేలాడగా, మరో వ్యక్తి వీడియో తీస్తూ కనిపించాడు. ఏమైనా జరిగితే ఏ తప్పూ చేయని ఆ ట్రక్కు డ్రైవర్ చిక్కుల్లో పడేవాడని, ఇలాంటి విన్యాసాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని నెటిజన్లు కోరుతున్నారు.