___ పౌరసరఫరాల శాఖ తీరుపై ఎమ్మెల్యే వనమాడి అసహనం..
6th sense TV:కాకినాడ జిల్లా :కాకినాడ సిటీ:
___ అధికారులు ద్వారంపూడికి తొత్తులుగా పనిచేస్తున్నారని విమర్శ
కాకినాడ, అక్టోబర్ 10: పౌరసరఫరాల శాఖ చెందిన అధికారులు నిర్వహిస్తున్న తీరుపై కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వర రావు (కొండబాబు) అసహనం వ్యక్తం చేశారు. కాకినాడ పోర్ట్ ఏరియాలో ఐదు సార్ర్టెక్స్ మిల్లులకు 15 రోజుల క్రితం అక్కడ కార్యకలాపాలు ఆపాలంటూ నోటీసులను పౌర సరఫరాల అధికారులు ఇచ్చినట్లు చెప్పారు. ఐదు మిల్లులు కార్యకలాపాలు ఆపివేయగా ఈ ఐదు మిల్లులుపై సుమారు 5వేల మంది వరకు కుటుంబ సభ్యులు జీవిస్తున్నారన్నారు. ఇవేమీ పట్టించుకోకుండా ఇదే ఏరియాలో శ్రీ చిత్ర ఆగ్రో ఎక్స్పోర్ట్ మిల్లు తీసుకున్న నోటీసులను పట్టించుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా మిల్లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్నారు.
ఈ మిల్లు కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారిదని చెప్పారు. గురువారం ఎమ్మెల్యే వనమాడి ఆ మిల్లులో జరుగుతున్న కార్యక్రమాలను పరిశీలించేందుకు వెళ్లారు.
ఈ సందర్భంగా అక్కడ ఆపై విషయాలను వివరించారు. కాకినాడలో పౌరసరఫరాల అధికారుల తీరు సరిగా లేదని ఇంకా వారు వైకాపా నేతల కనుసన్నల్లోనే పనిచేస్తున్నారని వీరిపై ఫిర్యాదు చేయనున్నట్లు వనమాడి చెప్పారు.