పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ అక్రమార్కులు…?
6th sense TV:కాకినాడ జిల్లా…
పిఠాపురం…
పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ అక్రమార్కులు దాడికి పాల్పడుతున్నారంటున్న బాధితులు.
డిప్యూటీ సీఎం సొంత నియోజకవర్గంలో రోజు రోజుకు భూ ఆక్రమణలు పెరిగిపోతున్నాయి.
ప్రశ్నించిన వారిపై మేము పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ అక్రమార్కులు దాడికి పాల్పడుతున్నారంటూ బాధితులు వాపోతున్నారు. పిఠాపురం మండలం, మల్లం గ్రామానికి చెందిన కుంపట్ల మునిరత్నం అనే వృద్ధురాలికి చెందిన 11 ఎకరాల వరి భూమిని ఆక్రమించేందుకు అదే గ్రామానికి చెందిన చెల్లారావు, రాజా అనే వ్యక్తులు ప్రయత్నించారని, ఆక్రమణను గ్రహించిన వృద్ధురాలు చేబ్రోలులో పవన్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన జనవాణి లో ఫిర్యాదు చేసి డిప్యూటీ సీఎం ఆశ్రయించారు. సదరు ఫిర్యాదు పై సానుకూలంగా స్పందించిన ఉప ముఖ్యమంత్రి తక్షణమే సమస్యను పరిష్కరించాలని జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించిగా, జిల్లా అధికార యంత్రాంగం హుటాహుటిన అక్రమనకు గురైన స్థలం వద్దకు చేరుకొని పూర్వపరాలు పరిశీలించి ఆర్డిఓ, ఎమ్మార్వో సమక్షంలో ఆ స్థలాన్ని వృద్ధురాలికి అప్పగించారు. జిల్లా అధికారుల ఆదేశాలను సహితం లెక్కచేయకుండా ఎవరు ఎన్ని చెప్పినా సరే తగ్గేదే లేదంటున్న అక్రమార్కులు తన పొలంలో పనిచేసుకుంటున్న వృద్ధురాలిపై దాడికి పాల్పడుతూ ఎవరైనా అడ్డొస్తే చంపేస్తానంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. భూ ఆక్రమణకు పాల్పడుతున్న సదర వ్యక్తులు కూడా జనసేన పార్టీకి చెందిన నాయకులు కావడంతో జిల్లా ఉన్నతాధికారులకు, పోలీసులకు ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.