మోటార్ సైకిల్స్ నడిపే ప్రతి ఒక్కరు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలి:కాకినాడ ట్రాఫిక్ 1 ఇన్స్పెక్టర్లు
6th sense TV: కాకినాడ జిల్లా: కాకినాడ సిటీ:
ఈరోజు (14.12.2024) వ తేదీన, *రోడ్డు ప్రమాదాలను తగ్గించాలనే ఉద్దేశంతోను మరియు సైబర్ నేరాలపై అవగాహన కల్పించడం కోసం* గౌరవనీయులైన *కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్., గారి ఉత్తర్వులు మేరకు, కాకినాడ SDPO శ్రీ రఘువీర్ విష్ణు గారి* పర్యవేక్షణలో కాకినాడ ట్రాఫిక్ 1 ఇన్స్పెక్టర్లు యన్. రమేష్, మరియు ట్రాఫిక్ యస్.ఐ పి. కిశోర్ కుమార్ గారితో, కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ వద్ద ఉన్న *” గవర్నమెంట్ జూనియర్ వొకేషనల్ కాలేజీ “* నందు విద్యార్థిని విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్ & రెగ్యులేషన్ పైన, హెల్మెట్ వాడకం పైన మరియు సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించినారు.
✍️ ప్రస్తుతం జరుగుతున్న సైబర్ నేరాలు, (ఆన్ లైన్ మోసాలు, పేక్ లోన్ మోసాలు, ఆన్లైన్ లో జాబ్స్ /వర్క్స్, డిజిటల్ అరెస్ట్) మరియు *”1930, 112,100,1972 కాల్”* యొక్క ఉపయోగాలు గురించి అవగాహన కల్పించారు.
✍️ తదుపరి *ట్రాఫిక్ రూల్స్* పై అవగాహనలో భాగంగా…
1) మోటార్ సైకిల్స్ నడిపే ప్రతి ఒక్కరు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని, ఈ విషయమై తమ కుటుంబసభ్యులకు మరియు తల్లి తండ్రులకు తెలియజేయాలనీ,
2) ట్రిపుల్ రైడింగ్, బైక్ స్టంట్స్, మైనర్ డ్రైవింగ్ వలన జరుగు ప్రమాదములు గురించి,
3) జీబ్రా లైన్స్ లేని ప్రదేశములలో రోడ్డు ను ఏవిధంగా దాటాలి, ట్రాఫిక్ Signs వలన ఉపయోగములు 🚫🚷🚯🚳🚱⚠️🚸🔻🔲
4) వాహనములను అతి వేగముగా నడపడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వలన కలుగు ప్రమాదాలు గురించి, అవగాహనను విద్యార్థినిలకు అవగాహన కల్పించాము.
ఇట్లు
CI ట్రాఫిక్ 1- PS కాకినాడ