___ కాకినాడ సిటీలో ఘోర ప్రమాదం!ఐదుగురు మృతి?.
___
6th sense TV:కాకినాడ, జూలై 20: కాకినాడ సిటీలో శనివారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కల్పన సెంటర్లో కారు మితిమీరిన వేగంతో వచ్చి ఢీకొట్టడంతో అక్కడ ముగ్గురు చనిపోయారని మరో ఇద్దరికి తీవ్ర గాయాలై చనిపోయినట్లు తెలిసింది. బీచ్ రోడ్డు నుంచి కొత్త కారు మితిమీరిన వేగంతో రావడంతో ఇద్దరిని ఢీ కొట్టగా వారికి తీవ్ర గాయాలయ్యాయని, ఆ కారు తిరగబడడంతో అందులో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని చెబుతున్నారు. అక్కడే ముగ్గురు చనిపోయినట్లుగా తెలియ వచ్చింది.మృతులు, ప్రమాద వివరాలు పూర్తిస్థాయిలో తెలియాల్సి ఉంది. దీనిపై పోలీసులు పూర్తిస్థాయి విచారణ చేపట్టారు.