___ జనసేన *జయకేతనం* సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి:మంత్రులు నాదెండ్ల, కందుల వెల్లడి….
పిఠాపురం, మార్చి 13:
జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవంనకు సంబంధించి సభను భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినట్లు జనసేన పిఎసి సభ్యుడు మంత్రి నాదెండ్ల మనోహర్, మరో మంత్రి కందుల దుర్గేశ్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు తెలిపారు. ఈ సభకు భారీ ఎత్తున జనసైనికులు, వీర మహిళలు, అభిమానులు హాజరవుతారన్నారు. ఈ సభ ద్వారా గిరిజన, జిల్లా, పిఠాపురం అభివృద్ధిపై ఒక ప్రతినిధి ప్రసంగం చేస్తారని వారు చెప్పారు. పిఠాపురం రాజా, డొక్కా సీతమ్మ, నాయకర్ వంటి మహనీయుల పేర్లను ప్రాంగణాలకు పెట్టామని వారు చెప్పారు.
*అన్ని ఏర్పాట్లు పూర్తి*
చిత్రాడలోని సభ ప్రాంగణం వద్ద గురువారం మాట్లాడారు. ఈ సభ పిఠాపురం మండలంలోని చిత్రాడ గ్రామంలో భారీ ఎత్తున నిర్వహించనున్నారు. శుక్రవారం జరిగే ఈ సభకు లక్షలాదిమంది జనసైనికులు వస్తారని అంచనా వేస్తున్నారు. డిజైన్లతో ఏర్పాటు చేసిన స్టేజి అందర్నీ ఆకట్టుకున్నాయి. సభకు హాజరయ్యే వాళ్ళకు కనిపించేలా పలు స్క్రీన్లను బారీ స్థాయిలో ఏర్పాటు చేశారు. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మినహా అన్ని స్థాయిల్లో ఉన్న జనసేన నాయకులు హాజరయ్యారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు పత్సమట్ల ధర్మరాజు, అరవ శ్రీధర్, పంచకర్ల రమేష్ బాబు, ఆరని శ్రీనివాస్, లోకం మాధవి, జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు తదితరులు పాల్గొన్నారు.


