ASD ఉమెన్స్ కళాశాల అభివృద్ధికి కృషి : కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు…

6th sense TV: కాకినాడ జిల్లా:కాకినాడ అన్నవరం సత్యవతీ దేవి గవర్నమెంట్ బాలికల కళాశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు.
కాకినాడ జిల్లాలోనే అన్నవరం సత్యవతీదేవి గవర్నమెంట్ బాలికల జూనియర్ కళాశాల ఆదర్శంగా ఉండే విధంగా అభివృద్ధి చేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు.
శుక్రవారం కాకినాడ
అన్నవరం సత్యవతీ దేవి గవర్నమెంట్ జూనియర్ కళాశాల లో ఇంటర్ విద్యార్థులకు నోటు పుస్తకాలు కళాశాల ప్రిన్సిపాల్ మూర్తి రాజు అధ్యక్షతన ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమెన్స్ కాలేజీలో సీటు కోసం డిమాండ్ అధికంగా ఉండేదని క్లాస్ రూమ్ లేకపోవడం వలన సీట్లు సర్దుబాటు చేయవలసిన పరిస్థితి నెలకొందన్నారు. గతంలో తాను అధికారంలో ఉన్నప్పుడు కళాశాలకు నూతనంగా బిల్డింగు ఏర్పాటు చేయడం జరిగిందని, కూటమి ప్రభుత్వ అధికారంలోకి రాగానే విద్య కు అధిక ప్రాథమిక ఇవ్వడం జరుగుతుందని, రాబోయే కాలంలో కళాశాల అభివృద్ధికి తన వంతు కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ వి అనంతలక్ష్మి, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ మూర్తి రాజు, దన కృష్ణ, ఎం. సువర్చల, ఎం. వసంత, ప్రమీల రాణి, టీడీపీ నాయకులు చొక్కా గిరి, బడే కృష్ణ, సాయినాథ్, చంటి, మౌళి, ప్రవీణ్, సప్తగిరి , కోనాడ ప్రకాష్, గంటి కుసుమహరి, ఏ. సత్యానందరావు, కె.ఎస్ ప్రసాద్, నాగేశ్వరావు, తదితరులు పాల్గొన్నారు.