ఆంధ్రప్రదేశ్

Kiran Kumar Reddy: బీజేపీలో చేరిన మాజీ సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి.. అందుకే కాంగ్రెస్‌ను వీడాల్సి వచ్చిందంటూ..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. కొద్దిరోజుల క్రితమే కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఇవాళ ఢిల్లీలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారు. మంత్రి ప్రహ్లాద్‌ జోషి, ఎంపీ డాక్టర్‌ లక్ష్మణ్‌తో పాటు పలువురు జాతీయ నేతలు కిరణ్‌కుమార్‌ రెడ్డిని అధికారికంగా బీజేపీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్‌ అధిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ 1962 నుంచి మా కుటుంబానికి కాంగ్రెస్ తో అనుబంధం ఉంది. మా తండ్రి చాలా తక్కువ వయస్సులోనే చనిపోయారు. కాంగ్రెస్‌ను వీడాల్సి వస్తుందని నేను అనుకోలేదు. నేను కాంగ్రెస్ పార్టీకి రెండో సారి రాజీనామా చేశాను. ఒకసారి రాష్ట్ర విభజన సమయంలో రాజీనామా చేశాను. మళ్లీ ఆ పార్టీలో చేరి బలోపేతం చేద్దాం అనుకున్నాను. కానీ ఆ పార్టీలో ఆ పరిస్థితి కనిపించలేదు. పొరపాటు జరిగినప్పుడు విశ్లేషించుకుని, జరిగిన తప్పును సరిదిద్దుకోవాలి. కానీ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. వైద్యుడు దగ్గరికి వెళ్లి టెస్టులు వద్దు, మందులు వద్దు అన్నట్టుగా కాంగ్రెస్ పనిచేస్తోంది. ప్రజలు ఎందుకు బీజేపీని కోరుకుంటున్నారు అని కాంగ్రెస్ ఆలోచించడం లేదు. ఒక రాష్ట్రం తర్వాత మరో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతున్నారు. ఎవరి సలహాలు తీసుకోవడం లేదు. వాళ్లకు అజమాయిషీ తప్ప బాధ్యత వద్దు అన్నట్టుగా ఉంది అక్కడ పరిస్థితి. ఎవరు ఏ పని బాగా చేయగలరో ఆ పని అప్పగించాలి’

6th Sense Tv

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

ఆంధ్రప్రదేశ్ కాకినాడ పాలిటిక్స్

కాకినాడ సిటీ నియోజవర్గం నుండి మహానాడు కు పెద్ద ఎత్తున తరలి వెళ్లిన వనమాడి కొండబాబు పసుపు సైన్యం

6త్ సెన్స్ టీవీ కాకినాడ రిపోర్టర్; బస్సులు, కార్ల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన కాకినాడ సిటీ నియోజకవర్గం ఇన్చార్జ్ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు కళాకారునిగా
ఆంధ్రప్రదేశ్

YSRCP Rebel MLAs: రెబల్‌ ఎమ్మెల్యేలకు మళ్లీ నోటీసులు.. 19న తుది విచారణ..!

అమరావతి:- వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఈ నెల 19వ తేదీన తుది విచారణకు సిద్ధం అవుతున్నారు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం..మరోసారి రెబల్‌