ఎన్నికల కోడ్ ఉల్లంఘన… అధికారిపై  వేటు..

6th sense TV:యలమంచిలి మండలంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించి టీడీపీ తరఫున ప్రచారం నిర్వహించిన మేడపాడుకి చెందిన వివోఏ చల్ల రాజ్యలక్ష్మిని విధుల నుంచి తొలగించారు. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సుమిత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రాజ్యలక్ష్మి ఇంటింటికి టీడీపీ మేనిఫెస్టో పంచుతున్నారని వైసీపీ ఎన్నికల ఏజెంట్ రామకృష్ణ ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి విధుల నుంచి తొలగించాలని కలెక్టర్ ఆదేశాలతో చర్యలు తీసుకున్నారు.